డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంపై సామూహిక ప్రతిజ్ఞ

On: November 18, 2025 5:43 PM
డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంపై సామూహిక ప్రతిజ్ఞ

డిగ్రీ కళాశాలలో మాదకద్రవ్యాల నిరోధకంపై సామూహిక ప్రతిజ్ఞ

ఏటూరునాగారం, నవంబర్ 18, తెలంగాణ జ్యోతి :  స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల  వేదికగా మాదకద్రవ్యాల ప్రతిభంధక విభాగం ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిరోధకంపై సామూహిక ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. నషా ముక్త్ భారత్ ఏర్పడి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రేణుక అధ్యక్షతన ప్రతిజ్ఞ చేపట్టారు.  రిసోర్స్ పర్సన్స్‌గా సిఐ ఎ. శ్రీనివాస్, ఎస్‌ఐ రాజుకుమార్, ఎస్‌ఐ టి.వి. సూరి (మంగపేట), బాలుర హాస్టల్ వార్డెన్ వెంకటేష్ పాల్గొని, విద్యార్థులకు మాదకద్రవ్యాల ప్రమాదాలు, వాటి నుండి దూరంగా ఉండాల్సిన అవసరంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యాంటీ డ్రగ్స్ సెల్ కన్వీనర్ సి.హెచ్. వెంకటయ్య, కనీస్ ఫాతిమా, సంపత్, రమేష్, రాజశేఖర్, భావన, శ్రీధర్, భాస్కర్, భారతి, శ్రీకాంత్, అధ్యాపక–అధ్యాపకేతర సిబ్బంది, పోలీసు అధికారులు, విద్యార్థినీ–విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

error: Content is protected !!