చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి కోకో జాతీయస్థాయికి ఎంపిక

On: December 2, 2025 5:57 PM
చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి కోకో జాతీయస్థాయికి ఎంపిక

చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థి కోకో జాతీయస్థాయికి ఎంపిక

ఏటూరునాగారం, డిసెంబర్ 2, తెలంగాణ జ్యోతి : మండలంలోని చిన్న బోయినపల్లి ఆశ్రమ హైస్కూల్‌కు గర్వకారణంగా, ఎనిమిదో తరగతి విద్యార్థి సిహెచ్ మాసయ్య కోకో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. పతంగి–భువనగిరి జిల్లాల్లో నవంబర్ 23, 24, 25 తేదీల్లో నిర్వహించిన ఎస్‌జి‌ఎఫ్‌ఐ రాష్ట్రస్థాయి కోకో పోటీల్లో 17 సంవత్సరాల బాలుర విభాగంలో మాసయ్య తన ప్రతిభను చాటాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున పాల్గొన్న ప్రభుత్వ తెగువెల్ఫేర్ ఆశ్రమ హైస్కూల్ (AHS) విద్యార్థులు ఎస్. శ్రీకాంత్ (పదో తరగతి), సిహెచ్ మాసయ్య (8వ తరగతి) ఇద్దరూ విశేష ప్రతిభ కనబరిచగా, ప్రత్యేకించి మాసయ్య ప్రదర్శన సెలెక్షన్ కమిటీని ఆకట్టుకుంది. అతడిని తెలంగాణ రాష్ట్ర జట్టులో చోటు కల్పిస్తూ ఎస్‌జి‌ఎఫ్‌ఐ నేషనల్ లెవెల్ కోకో టోర్నమెంట్‌కు ఎంపిక చేశారు. మాసయ్య త్వరలో తెలంగాణ తరఫున ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, అయోధ్యలో జరిగే జాతీయస్థాయి కోకో పోటీల్లో పాల్గొననున్నాడు. ఈ విజయంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈసం రమేష్, పిడి వెంకటేష్, పిటి రమేష్, డిప్యూటీ వార్డెన్ నరసింహారావు తదితరులు, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు సిహెచ్ మాసయ్యను అభినందించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment