భూభారతి అవగాహన సదస్సులు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆధ్వర్యంలో భూభారతి అవగాహన సదస్సులు జిల్లా వ్యాప్తంగా గురువారం ప్రారంభమయ్యాయి. ఈనెల 17వ తేదీ నుండి 22వ తేదీ వరకు మొత్తం ఆరు రోజులు పాటు ములుగు జిల్లాలో నిర్వహించనున్నారు. ఈ మేరకు నూగూరు వెంకటాపురం, వాజేడు మండలాల్లో 22వ తేదీ మంగళవారం ఒకే రోజు రెండు మండలాల్లో నిర్వహిస్తారు. మండలంలోని పాత్రాపురం రైతువేదికలో ఉదయం 10 గంటల కు భూభారతి అవగాహన సధస్సు రైతులతో కలెక్టర్ నిర్వహిస్తా రు.అనంతరం అదేరోజు వాజేడులోని రైతువేదికలో మధ్యాహ్నం 2 గంటలకు భూభారతి అవగాహన సదస్సు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా కలెక్టర్ పర్యటన షెడ్యూల్ ను, అధికారిక ప్రకటనను అదికారులు మీడియాకు గురువారం విడుదల చేశారు. రైతు సోదరులు ప్రతి ఒక్కరు భూభారతి అవగాహన సదస్సు హాజరు కావాలని ఈ సందర్భంగా ఆయా మండలాల తాసిల్దారులు రైతులకు విజ్ఞప్తి చేశారు.