ఎయిడ్స్ పై ఆశా కార్యకర్తలకు అవగాహన
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: హెచ్ఐవి ఎయిడ్స్ పై పూర్తి అవగాహన కలిగి ఉండాలని మహాదేవపూర్ ఐసీటీసీ కౌన్సిలర్ గాదే రమేష్ అన్నారు. మంగళవారం ఆశా డే సందర్భంగా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. కాటారం పి హెచ్ సి మెడి కల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో ఐ సి టి సి కౌన్సిలర్ గాదె రమేష్ అవగాహన కల్పించారు. ప్రతి గర్భిణీ స్త్రీని హెచ్ఐవి పరీక్షలు చేయించాలని సూచిం చారు. సుఖ రోగాలు, టీబీ కలిగి ఉన్న వారికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తెలుసుకొని మసులు కోవడమే అసలైన మందు అని అన్నారు.పాజిటివ్ వ్యక్తులను ఆదరించాలని సూచించారు. సక్రమంగా ఏ ఆర్ టీ మందులు వాడుకునే విధంగా రోగులను పురమాయించాలని పేర్కొన్నా రు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈ ఓ తిరుపతిరెడ్డి, సిహెచ్ఓ నిర్మల, సూపర్వైజర్లు పద్మావతి, సరళ, టీబీ సూపర్వైజర్ రమేష్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.