బాలికల సాధికారతపై అవగాహన సదస్సు
కాటారం, తెలంగాణ జ్యోతి, జనవరి 20 : బాలికల సాధికారతపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు బాలికల జాతీయ దినోత్సవం సందర్భంగా కాటారం మండలం కాటారం, దామరకుంట గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో అవగాహన సదస్సు నిర్వ హించారు. భేటీ బచావో , బేటి పడావో అనే నినాదాలతో బాలికల చేత ప్రతిజ్ఞ చేయించారు. బాలికలపై జరుగుతున్న అరాచకాలను నివారించు కునేందుకు ప్రభుత్వం కల్పించిన టోల్ ఫ్రీ నెంబర్ 1098, అలాగే మహిళ లపై జరుగుతున్న అకృత్యాల నివారణకు 181 టోల్ ఫ్రీ నెంబర్లను ఉపయోగించుకోవాలని వారు వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ అనూష, సిహెచ్ఎల్ జిల్లా కోఆర్డినేటర్ తిరుపతి, డి సి పి యు కౌన్సిలర్ శైలజ, కళావతి, మమత, సురేష్ పాల్గొన్నారు. పాఠశాలల ప్రిన్సిపాల్ శైలజ, అనురాధ, మమత, ఉపాధ్యాయినిలు, విద్యార్థినిలు పాల్గొన్నారు.