రామాలయంలో ఏఎస్పీ పూజలు
ఏటూరునాగారం : మండల కేంద్రంలోని శ్రీసీతారామ చంద్ర స్వామి ఆలయంలో గురువారం స్థానిక ఏఎస్పీ శివం ఉపాద్యాయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టతను ఆలయ పూజారి యల్లప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ వివరించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అలువాల శ్రీనివాస్, గడదాసు శివ తదితరులు పాల్గొన్నారు.