కౌలు రైతులకు రూ.15వేలు చెల్లించాలి

కౌలు రైతులకు రూ.15వేలు చెల్లించాలి

– బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జి పెద్ది మహేందర్ రెడ్డి 

ములుగు ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మేనిఫె స్టోలో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు ఎకరానికి రూ. 15వేలు చెల్లించాలని కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జి పెద్ది మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ములుగులోని పార్టీ జిల్లా కార్యాలయం అద్యక్షుడు సిరికొండ బలరాం అధ్యక్షతన జరిగిన సమావేవంలో ఆయన మాట్లాడారు. రైతులకు రూ.15వేలు, కూలీలకు ఏడాదికి రూ.12వేలు ఇస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. కౌలు రైతులను పట్టించు కున్న పాపాన పోలేదని, అదేవిధంగా రైతులకు ర.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.లక్షలోపు మాత్రమే మాఫీచేయడం రైతులను మోసం చేయడమేనన్నారు. బీజేపీ ఎల్లపుడు రైతుల పక్షాన మద్దతుగా కాంగ్రెస్ హామలు అమలు చేసేవరకు పోరాడుతుందన్నారు. ఈ సమావేశంలో గిరిజన మోర్చా రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేష్, ఎస్.రవీంద్రాచారి, కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జాడి రామరాజు నేత, మాజీ జిల్లా అధ్యక్షుడు జినుకుల కృష్ణకర్ రావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాయంచు నాగరాజు, ప్రధాన కార్యదర్శి హనుమంత రెడ్డి, కార్యాలయ సహా కార్యదర్శి దొంతిరెడ్డి రవిరెడ్డి, ములుగు మండల అధ్యక్షులు గాదం కుమార్, తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ములుగులో జరిగిన మరో సమావేశంలో రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం మాట్లా డుతూ ఆరు గ్యారంటీల అలమలుకు బడ్జెట్ కేటాయించ లేదని, ఆదాయానికి కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేదని విమర్శించారు. బడ్జెట్ పేరుతో అంకెల గారెడీని చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment