అంబేద్కర్ చిత్రపటాన్ని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో విధిగా ఏర్పాటు చేయాలి.
– గణతంత్ర దినోత్సవం రోజు అంబేద్కర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి.
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాన్ని జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ప్రభుత్వ కార్యాల యాల్లో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ములుగు జిల్లా వెంకటాపురం మండలంకు చెందిన సామాజిక కార్యకర్త తిప్పనపల్లి రాంబాబు శుక్రవారం మండల తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. స్వాతంత్రం సిద్దించి 76 సంవత్సరాలు నిండుతున్న భారత రాజ్యాంగ నిర్మాత మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాన్ని చాలా ప్రభుత్వ కార్యాల యాలలో నేటికీ ఏర్పాటు చేయలేదని ఆవదన వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తిని ప్రభుత్వానికి తెలియపరచి మహానుభావుడు అంబేద్కర్ చిత్రపటాన్ని గణతంత్ర వేడుకల్లో ప్రభుత్వ,ప్రైవేట్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త విజ్ఞప్తి చేశారు.