వెంకటాపురం పరిధిలోని నాయకపోడ్ లందరూ ఆదివాసీలే
– నాయక పోడ్ దెబ్బ రాష్ర్ట వర్కింగ్ కమిటీ సభ్యులు బొల్లెం సారయ్య నాయకపోడ్
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లాలోని వెంకటాపురం మండల పరిధిలోగల నాయకపోడ్ లు అందరూ ఆదివాసీలేనని ఆదివాసీ నాయక పోడ్ దెబ్బ రాష్ర్ట వర్కింగ్ కమిటీ సభ్యులు బొల్లెం సారయ్య నాయక పోడ్ స్పష్టం చేశారు. మంగళవారం ములుగు కలెక్టరేట్ ఎదు ట నిరసన వ్యక్తం చేస్తూ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సారయ్య నాయకపోడ్ మాట్లాడుతూ.. జిల్లా లోని నూగూరు వెంకటాపురం మండలంలో ఏళ్ల తరబడి నాయకపోడ్ తెగ జీవిస్తున్నారని, వారిని గుర్తించి ఎస్టీ తెగ సర్టిఫికెట్లు అందించారన్నారు. ఆ సర్టిఫికెట్లను యధావిధిగా కొనసాగించాలని, అదేవిధంగా అనాదిగా కొత్త కొండాపురంలో వెలిసిన నాయక పోడ్ దేవర అభివృద్ధికి నిధులు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్ అధికారులను తప్పుదోవ పట్టించే నివేదికలను కొందరు ఆఫీసర్లు అందిస్తున్నారన్నారు. 5వ షెడ్యూల్ ప్రాంతంలో పెసా నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వ్యవహరించాలన్నారు. ఐదవ షెడ్యూల్ భూభాగం తో పాటు మెజారిటీగా అదివాసి నాయకపోడ్ ప్రజలు మైదా న ప్రాంతంలో బతుకుదెరువు కోసం నివసిస్తున్నారని, ఆచార సాంప్రదాయాలను కాపాడాలన్నారు. కొత్త కొండాపురం గ్రామం లోని నాయకపోడులందరికీ రెవెన్యూ అధికారులు ఎస్టీ సర్టిఫికెట్లు జారీ చేశారని, వాటిని కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకుడు నెమలి నర్సయ్య, నాయకపోడ్ దెబ్బ ఉత్తర తెలంగాణ జిల్లాల ఇంచార్జ్ గాలి సమ్మయ్య నాయకపోడ్, భద్రాచలం నియోజక వర్గ ఇంచార్జ్ పూజారి లక్ష్మణ్, విద్యార్థి విభాగం రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇండ్ల సమ్మయ్య, యువసేన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ గోనే లక్ష్మణ్, ములుగు జిల్లా కో చైర్మన్ గుర్రపు రామన్న, ఏటూరునాగారం సబ్ డివిజన్ కార్యదర్శి చిలక రాణీ, తదితరులు పాల్గొన్నారు.