భోదాపురం,ఆలుబాక గోదావరి తీరంలో పెద్దపులి సంచారం
– భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి: వెంకటాపురం మండలం ఆలుబాక, బోధపురం గ్రామాల రైతులు గోదావరి పాయలోని పుచ్చ తోటకు వెళుతున్న క్రమంలో పెద్దపులి అడుగుజాడలు ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. పుచ్చ తోట దగ్గర కాపలాగా పడుకున్న కురుసం నరసింహ మూర్తి అనే రైతు రాత్రి సమయంలో పెద్ద పులిని చూసినట్లు, ఆ రైతు పులికి కనిపించకుండా భయ భ్రాంతులకు గురై దాక్కుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రాత్రంతా మెలుకు వతో ఉన్నానని రైతు ఫోను ద్వారా గ్రామ పెద్దలకు ఫోన్ చేసి చెప్పానని రైతు తెలిపాడు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు గోదావరి పాయ వద్దకు చేరుకొని కనిపి స్తున్న అడుగులను పులి అడుగులని నిర్ధారించారు. అడుగు లను పూర్తిస్థాయిలో పరిశీలిస్తున్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు పులి అడుగుల బట్టి మంగపేట గోదావరి వైపు వెళ్లిందని ఇన్చార్జి ఫారెస్ట్ అధికారి చంద్రమౌళి పేర్కొ న్నారు.