ఈ నెల 21 నుంచి దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల స్వీకరణ

Written by telangana jyothi

Published on:

ఈ నెల 21 నుంచి దివ్యాంగుల ఉపకరణాలకు దరఖాస్తుల స్వీకరణ

జిల్లా కలెక్టర్ దివాకర టి. ఎస్.

ములుగు ప్రతినిధి : జిల్లాలోని దివ్యాంగులకు ఉపకరణాల దరఖాస్తుల స్వీకరణ కు తేది 21, 22, 23 లలో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ సదవకాశాన్ని జిల్లాలోని దివ్యాం గులు వినియోగించు కోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, మండల తహసిల్దారులు, మండల అభివృధి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చెయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి  దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక చొరవతో జిల్లా లోని దివ్యాంగుల అందరికి సహాయ ఉపకరణాలు అందించడం కొరకు, అందరి సౌకర్యార్ధం కొరకు ప్రతేకంగా మూడు ప్రాంతాలలో దివ్యాం గుల నుండి దరఖాస్తులను స్వీకరించడం కొరకు ప్రత్యేక నమోదు శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగినదని అన్నారు. జిల్లాలోని అందరు ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, మండల ప్రత్యేక అధికారులు గ్రామ గ్రామాన దివ్యాం గులందరూ ఈ శిబిరాలకు వచ్చి నమోదు చేసుకునే లాగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, గ్రామాలలో టామ్ టామ్ ద్వారా చాటింపు చేయించి ఎక్కువ అవగాహన కల్పించా లని, అధిక మొత్తంలో దివ్యాంగులు దరఖాస్తులు చేసుకొని, సహా- యపకరణాలు పొందేలాగా అధికారులందరూ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా సంక్షేమ అధికారినీ ఈ మూడు శిబిరాలను సమన్వయం చేసుకొని అధిక సంఖ్యలో దివ్యాంగులు నమోదు చేసుకునేలాగా ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ములుగు జిల్లా, ములుగు నియోజకవర్గం దివ్యాంగుల సహాయ ఉపకారణల కొరకు అలింకో వారిచే అర్హులైన దివ్యాంగుల ఎంపిక, నమోదు శిబిరం. నిర్వహించ బడుతుంది. మూడు శిబిరాల ద్వారా వివిధ రకాలైన వైకల్యాలలో అర్హులైన దివ్యాంగులను గుర్తించి వారికి అవసరమైన సహాయ ఉపకరణాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జిల్లాలోని అంధులైన బాల బాలికలు పాఠశాలల్లో/కళాశాలలో చదువు తున్న వారు వారి వైకల్యం 40% పైన ఉన్నటువంటి వారికి స్మార్ట్ ఫోన్ లను కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. శిబిరానికి అర్హులైన దివ్యాంగులు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు-3, సదరం సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రము /రేషన్ కార్డు, ఆధార్ కార్డు కాపీలు, UDID కార్డు లతో (Disabilities Identity Card), అంధులైన బాల, బాలికలు చదువుతు న్నటువంటి పాఠశాల లేదా కళాశాల నుండి బోనఫైడ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలి. ఈ సదవకాశాన్ని జిల్లాలోని అందరు దివ్యాంగులు వినియోగించుకోవాలని, ఇట్టి సమాచారం అందరికి చేరేలా అధికారులందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. వివరాల కోసం 9550135694, 9849390877 ఫోన్ నంబర్లను సంప్రదించగలరు. ఈ సమావేశంలో జిల్లా అధికా రులు, మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడి ఓలు, ఎంపిఓ లు, తదితరులు పాల్గొన్నారు.

శిబిరం తేదీ వివరాలు

ఆగస్టు 21 : ఉదయం 10 గంటల నుండి బండారుపల్లిలోని గిరిజన భవన్.

ఆగస్టు 22: ఉదయం 10 గంటల నుండి పసర పంచాయతీ కార్యాలయం.

ఆగస్టు 23: ఉదయం 10 గంటల నుండి ఏటూరునాగారంలో గిరిజన భవన్.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now