ప్రయాణికులతో కిక్కిరిసిన ఆర్టీసీ బస్టాండ్
– ప్రభుత్వాలు మారిన ప్రజల అవస్థలు మారడం లేదు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. రాఖీ పండుగకు వచ్చిన మహిళలు తిరుగు ప్రయాణంలో మండల కేంద్రం నుండి పలు ప్రాంతాలకు తగినన్ని బస్సులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. గడిచిన ఏళ్లలో అధికార పార్టీలు మారుతున్నయే తప్ప ఏటూరునాగారంకు సరిపడా బస్సులు వేసిన దాఖలాలు లేవు. గోదావరి వంతెన ప్రారంభం అయినప్పటి నుండి ప్రయా ణికులు వెళ్లవలసిన దూరం దగ్గర అవుతుందని ఏటూరు నాగారం మీదుగా వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు సరిపడా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.