సరస్వతి పుష్కరాల నిర్వహణపై సమీక్ష

Written by telangana jyothi

Published on:

సరస్వతి పుష్కరాల నిర్వహణపై సమీక్ష

– అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

   కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి: ఐడిఓసి కార్యాలయంలో కాళేశ్వరం  సరస్వతి పుష్కరాల నిర్వహణపై దేవాదాయ, పంచాయతీ రాజ్, సమాచార, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సోమవారం సమీక్షా సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పుష్కరాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా సమ స్యలు నివారించేందుకు అన్ని విభాగాల అధికారుల సమన్వ యం కీలకమని స్పష్టం చేశారు. ఏర్పాట్లు, సమాచారం భక్తులు సులభంగా తెలుసుకోవడానికి వీలుగా మాాస్టర్ ప్లాాన్ తయారు చేయాలని సూచించారు. పుష్కర ఘాట్ల వద్ద పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఎప్పటికపుడు వ్యర్థాల తొలగింపుకు ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని, ట్రాక్టర్లు ఏర్పా టు చేయాలని డిపిఓకు సూచించారు.త్రాగునీరు, మరుగుదొడ్ల ను  గుర్తించడానికి వీలుగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలని తెలి పారు. భక్తుల సౌకర్యార్థం త్రాగునీటి నిల్వలు, శౌచాలయాలను  ఏర్పాటు చేయాలన్నారు. అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై ఇచ్చిన నివేదిక ఆధారంగా పరిశీలన చేసి మార్పులు, చేర్పులు ఉంటే మళ్ళీ ఇవ్వాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ఎలాంటి విద్యుత్ అంతరాయం రాకుండా పుష్కర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో ఆటకం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధి కారులను ఆదేశించారు. సరస్వతి పుష్కరాల ప్రాధాన్యాన్ని భక్తులకు తెలియజేయడానికి సమాచార శాఖ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. రవాణా శాఖ ప్రత్యేక బస్సులు నిర్వహించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పుష్కరాలను విజయవంతంగా నిర్వహించగలమని, వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, డిపిఆర్ఓ శ్రీనివాస్, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, పిఆర్ ఈ ఈ వెంకటేశ్వర్లు, దేవాలయ ఈ ఓ మారుతి, మహదేవ పూర్ తహసిల్దారు, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now