విప్లవ మావోయిస్టు పార్టీలకు ఎవరు సహకరించొద్దు

Written by telangana jyothi

Published on:

విప్లవ మావోయిస్టు పార్టీలకు ఎవరు సహకరించొద్దు

– సమాచారం ఇచ్చిన వారికి నగదు బహుమతి ఇస్తాం

– సీఐ అనుముల శ్రీనివాస్

– అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల కరపత్రాలు విడుదల 

ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఏజెన్సీ గ్రామీణ అటవీ ప్రాంతాలలో అజ్ఞాత మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని, విప్లవ మావోయిస్టు పార్టీల సభ్యుల సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలపాలని ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్, ఎస్ఐ తాజుద్దీన్ కోరారు. మావోయిస్టుల ఫొటోలతో కూడిన వాల్ పోస్టర్లు, కరపత్రాలను పోలీసులు సోమవారం విడుదల చేశారు. మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్, ప్రధాన కూడళ్లలో అంటించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్సైలు మాట్లాడుతూ వాల్ పోస్టర్లో ఉన్న వారి గురించి సమాచారం తెలిస్తే పోలీసులకు నేరుగా గాని, ఫోన్ ద్వారాగాని సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టుల సమాచారం తెలియజేసిన వారికి పోస్టర్లో ఉన్న విధంగా నగదు బహుమతి అందిస్తామని స్పష్టం చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అజ్ఞాతంలో ఉన్నటువంటి మావోయిస్టులు పోరాటం చేయాల్సింది అడవిలో కాదని, ప్రజల మధ్యలో ఉండి ప్రజా జీవనములోకి వచ్చి సమస్యలపై చట్టబద్ధంగా పోరాడాలని, ప్రజలచే ఎన్నుకోబడీ చట్టసభల్లోకి ఎన్నికై పోలీసుల గౌరవ వందనం పొందాలని అన్నారు. మావోయిస్టుల సమాచారం తెలిస్తే 8712670100 (ములుగు ఎస్పీ శబరీష్), 8712670104 (ఏటూరు నాగారం ఏఎస్పీ), 8712670113 (సిఐ అనుముల శ్రీనివాస్), 8712670090 (ఎస్సై ఎస్కే తాజుద్దీన్) నెంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now