వైభవంగా గ్రామ బొడ్రాయి శంకుస్థాపన

Written by telangana jyothi

Published on:

వైభవంగా గ్రామ బొడ్రాయి శంకుస్థాపన

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : కాటారం మండలం రేగుల గూడెం గ్రామపంచాయతీ పరిధిలో బూడిది పల్లి గ్రామంలో బొడ్రాయి శంకుస్థాపన జరిగింది. భారీ ఎత్తున ప్రజలు వారి బంధువులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ ఆడ పడుచులు, దగ్గరీ బంధువులు ఆత్మీయత అనురాగాలు పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కుంకుమ అర్చన, పూజ వేద పండితుల మధ్య జరిగింది. హోమ గుండాలు ఏర్పాటుచేసి నవరత్న పూజలు చేశారు. వేద పండితులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమం నిర్వహించి ప్రజల మన్ననలు పొందారు. బొడ్రాయి శంకుస్థాపనకు అవసరమైన దేవతల విగ్రహాలను స్థానిక తెప్పల దేవేందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి సోదరులు విగ్రహాన్ని సొంత ఖర్చులతో అందజేశారు. గ్రామ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మంగళ , బుధ వారం రోజులలో గ్రామంలో కుల దేవతల ఊరేగింపు ఉంటుందని పుర ప్రముఖులు వెల్లడించారు. గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న విగ్రహాలకు భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహించారు. గ్రామం అంతా ఆనందంతో చుట్టాల బంధువులతో నిండి పోయింది.

Leave a comment