వెంకటాపురంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ.

Written by telangana jyothi

Published on:

వెంకటాపురంలో రైతు భరోసా అభిప్రాయ సేకరణ.

 – 5 నుండి 10 ఎకరాలు లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా,రైతు బందు కల్పించాలి. 

వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి :  రైతు భరోసా పథకంపై అత్యవసర సర్వసభ్య సమావేశం ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని, ప్రాథమిక సహకార సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల లోని వివిధ ప్రాంతాల నుండి రైతులు రైతు భరోసా పథకం పై అభిప్రాయ సేకరణలో వారి ,వారి సలహాలను అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆయా రైతులు యొక్క అభిప్రాయ సేకరణ ను సొసైటీ సిబ్బంది మినిట్స్ లో నమోదు చేశారు. ముఖ్యంగా ఐదు నుండి పది ఎకరాల లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా, రైతుబంధు కార్యక్రమాన్ని అమలు చేయాలని, భూస్వాములుకు , ఎక్కువ విస్తీర్ణం కలిగిన వారికి రైతుబంధు రైతు భరోసాను నిలిపివేయాలని మెజారిటీ రైతులు సమావేశంలో అభి ప్రాయం వ్యక్తం చేశారు. రైతుబంధు నగదును రెట్టింపు చేయాలని రైతులు తమ అభిప్రాయాలను వెళ్ళబుచ్చారు. అలాగే కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం వర్తింపజేయాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని రైతు సంఘం నాయకులు చిట్టెం ఆదినారాయణ , సన్నా చిన్న కారు రైతు నేత సుద్దపల్లి సత్యనారాయణ పటేల్ తమ అభిప్రాయాలను వెలి బుచ్చారు. సమావేశంలో సుమారు 150 మందికి పైగా రైతులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట రుణాల మాఫీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తామని ప్రకటించడం పట్ల సమావేశం లో రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే రైతుబంధు రైతు భరోసాను ప్రస్తుతం ఇస్తున్న సహాయం కంటే రెట్టింపు చేయాలని సమావేశంలో, అధిక సంఖ్యలో రైతులు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమావేశానికి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు చిడెం మోహన్ రావు అధ్యక్షత వహించారు. ములుగు జిల్లా వ్యవసాయ శాఖ జిల్లా అధికా వి . విజయచంద్ర, డిసిఓ కార్యాలయం నుండి అదికారి చంద్రశేఖర్, వ్యవసాయ విస్తరణ అధికారి శ్యాం కుమార్, సొసైటీ ముఖ్య కార్యనిర్వహ అధికారి ఆర్. వి .వి. సత్యనారాయణ ,ఆర్ వి వి సత్యనారాయణ, తోట పూర్ణ, సుధారాణి , మరియు పెద్ద సంఖ్యలో రైతులు రైతు భరోసా అభిప్రాయ సేకరణ అత్యవసర సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now