క్రీడలు స్నేహ సంబంధాలు, మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి
– వెంకటాపురం సి.ఐ. బి. కుమార్.
వెంకటాపురం, నూగూరు తెలంగాణ జ్యోతి : క్రీడలు స్నేహ సంబంధాలను, మానసిక ఉల్లాసాన్ని, దేహదారుడ్యాన్ని పెంపొం దిస్తాయని, వెంకటాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. కుమార్ అన్నారు. సోమవారం సంక్రాంతి పండగ సందర్భంగా మండల కేంద్రంలో కాపేడ్ స్వచ్ఛంద సంస్థ గ్రౌండ్లో వెంకటాపురం క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను సి.ఐ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం నుండి ఆది వారం వరకు జరిగే క్రీడలలో వెంకటాపురం, వాజేడు క్రికెట్ టీంలు పాల్గొంటాయి. సోమవారం పోలీస్ వర్సెస్ ప్రెస్ ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. సిఆర్పిఎఫ్ డిఎస్పి టాస్ వేయగా సీ.ఐ కుమార్ రిబ్బన్ కట్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం వాస్తవ్యులు కొత్తగూడెం పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ.కె నరేష్, వెంకటాపురం ఎస్.ఐ. కే. తిరుపతి రావు, జర్నలిస్ట్ సంఘం నేత బాచినేని ప్రవీణ్ చౌదరి, శిక్షణ ఎస్ఐ, మరియు వెంకటాపురం, వాజేడు మండలాల ప్రింట్ మరి యు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.