భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మ
తెలంగాణ జ్యోతి, భూపాలపల్లి ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా రాహుల్ శర్మను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారి చేశారు. ఇప్పటివరకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా పని చేసిన భవేష్ మిశ్రను బదిలీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇచ్చిన విషయం ఇంకా తెలియ రాలేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ తాజాగా శనివారం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల మార్పు అనివార్యమైంది.