విదేశీ పర్యటనలో నర్సంపేట ఎమ్మెల్యే
తెలంగాణ జ్యోతి, దుగ్గొండి : విదేశీ పర్యటనలో భాగంగా కెనడాలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్మించి ఆట మహాసభలకు ఆహ్వానం తీసుకున్న ఎమ్మెల్యే దొంతి అమెరికా పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం అక్కడి నుండి కెనడా దేశం పర్యటనకు వెళ్లిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కెనడాలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ( టి టి ఎఫ్ ) ఆధ్వర్యంలో ఫోరం సభ్యులు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికి ప్రవాస భారతీయులు శాలువాల తో సత్కరించారు.ఈ సందర్భంగా ఫోరం సభ్యులు నర్సంపేట ప్రాంత అభివృద్ధికి దొంతి చేసిన సేవలను కొనియాడారు. నర్సంపేట అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కెనడాలో ఉన్న తెలుగు వారందరి కలయికతో నిర్వహించిన ఈ అపూర్వ సమ్మేళనం.తనకు ఎంతో సంతోషా న్ని ఇచ్చింద న్నారు తనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధి ఎన్నారైల సహకారం మరువ లేనన్నారు. తెలంగాణ డెవల ప్మెంట్ ఫోరం సభ్యులు రాజకీయంగా, ఆ ర్థికంగా సామాజి కంగా రాణించి ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షంచారు. భారతీయులు ఐక్యంగా ఉంటూ తెలంగాణతో పాటు నర్సంపేట ప్రాంత ప్రజల అభివృద్ధికి మీ సహాయ సహకా రాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెనడా తెలం గాణ డెవలప్మెంట్ ఫోరం సభ్యులు పాల్గొన్నారు.