రామప్ప చెరువులో మృతదేహం లభ్యం.
తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ప్రఖ్యాతి గాంచిన రామప్ప చెరువులో గుర్తుతెలియని మృతదేహం లభ్యమయింది. వివరాల్లోకి వెళ్తే… శుక్రవారం ఉదయం చెరువు వద్దకు వేటకు వెళ్లిన మత్స్యకారులకు గుర్తు తెలియని మృతదేహం నీటిపై తేలియాడుతూ కనపడగా పోలీసులకు సమాచారం అందిం చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటికి తీయించారు.కాగా,మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.