ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి పరీక్షలు
ఏటురునాగారం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా ఏటురునాగారం ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్ విద్యార్థులకు ఆర్బీఎస్సే ఆధ్వర్యంలో శనివారం పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్ చే 299 విద్యార్థినులకు కంటి చూపు పరీక్షలు నిర్వహించారు. అందులో 20 మంది విద్యార్థినులు కంటిచూపు సమస్యతో బాధపడుతున్నట్టు గుర్తించి 18 మంది విద్యార్థినులకు కంటి అద్దాలు రాయడం జరిగింది.ఇద్దరు విద్యార్థినులను వరంగల్ రీజినల్ ఐ హాస్పిటల్ కు రెఫర్ చేయడం జరిగింది. అదేవిధంగా ములుగు మండలం జాకారం,బండారు పల్లి వెంకటాపూర్ మండలం రామా నుజాపూర్,బూర్గుపేట, కర్లపల్లి ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు ఆప్తాల్మిక్ ఆఫీసర్ ఆఫీసర్ చే కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా 1216 విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 56 మంది విద్యార్థులకు కంటి అద్దాలు రాయడం జరిగింది. 6గురు విద్యార్థులను రీజినల్ ఐ ఆసుపత్రి వరంగల్ కు రెఫర్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్బీఎస్కే బృందం వైద్యులు డాక్టర్ నరహరి,డాక్టర్ సుజాత,డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ మల్లికార్జున్,డాక్టర్ శ్రీలత,డాక్టర్ జయప్రద ఫార్మసిస్టు భాస్కర్, ఆప్తాల్మిక్ ఆఫీసర్ రాజన్న పాల్గొన్నారు.