బండారుపల్లి రహదారిలో చలివేంద్రం ఏర్పాటు
– గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గండ్రకోట శ్రీదేవి సుధీర్
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా కేంద్రంలోనీ బండారుపల్లి రహదారిలో గండ్రకోట సుధీర్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గండ్రకోట సుధీర్ ప్రారం భించారు.ఈ సంద ర్భంగా గండ్రకోట సుధీర్ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంతో పాటు ఇతర గ్రామాల ప్రజలకు 24 గంటల దాహం తీర్చుకోవడానికి చలివేద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.వేసవికాలం ఎండలు తీవ్రతరం అవుతున్న దరిమిలా వివిధ దూర ప్రాంతాల నుండి వస్తున్న ప్రజలకు దాహార్తిని తీర్చేం దుకు త్రాగునీరు అందుబాటులో ఉండాలని చలివేంద్రం ప్రారంభించినట్లు పేర్కొన్నారు.ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తూ పోతూ ఉంటారు.కనుక పేదలకు త్రాగునీరు కోసం ఇబ్బంది కలగవద్దని స్వచ్చంధంగా పలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ సౌకర్యం వేసవి పోయేంతవరకు అందుబాటులో ఉంచుతూ, ప్రజలకు అండగా నిలుస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఆటో యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.