ఈనెల 20న నిరుద్యోగులకు జాబ్ మేళా.
వెంకటాపురం నూగూరు, జనవరి 16, తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అథికారి ఆదేశానుసారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ జాకారం ములుగు జిల్లా నందు నిరుద్యోగ యువతీ యువకులకు ఈనెల 20 న ఉదయం 10 గంటలకు జాబ్ మేళ నిర్వహించనున్నట్లు ఒక ప్రకటలో తెలిపారు. జాబ్ మేళాలో 20 బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయి. కనీస వేతనం 15,000 వేల రూపాయల నుండి 30,000 వెల రూ. వరకు వేతనం వుంటుంది. ఈ జాబ్ మేళాలో పాల్గొనే నిరుద్యోగ యువతీ, యువకులు కనీస చదువు పదో తరగతి నుండి ఆ పైన చదువుకొని ఉండాలి. కావున ఆసక్తిగల నిరుద్యోగ యువతీ యువకులు ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొని ఉపాధి అవకాశాలు పొందగలరని ప్రాజెక్టు అధికారి కోరారు.