ఏడాదికోసారి వికసించే మే పుష్పం కనువిందు

On: May 20, 2026 9:31 PM

ఏడాదికోసారి వికసించే మే పుష్పం కనువిందు

అరుదైన ‘ఫుడ్ బాల్ లిల్లీ’ పువ్వును తిలకించేందుకు ఆసక్తి

వెంకటాపురం, మే 20, తెలంగాణ జ్యోతి: వాజేడు మండలం పెద్దగొల్లగూడెంలో ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే అరుదైన మే పుష్పం బుధవారం అందరినీ ఆకట్టుకుంది. మాజీ సర్పంచ్ జజ్జరి మేనక సత్యనారాయణ ఇంటి పెరట్లో ఉన్న ఈ మొక్క ప్రతి సంవత్సరం మే నెలలో తొలకరి చినుకులతో మొలకెత్తి అందమైన పుష్పాన్ని పూయడం ప్రత్యేకతగా నిలుస్తోంది. ‘ఫుడ్ బాల్ లిల్లీ’గా కూడా పిలిచే ఈ అరుదైన పుష్పం రంగుల హరివిల్లులా అందాలను వెదజల్లుతూ స్థానికులను ఆకర్షిస్తోంది. అరుదుగా కనిపించే ఈ పుష్పాన్ని చూసేందుకు పలువురు గ్రామస్థులు ఆసక్తిగా తరలివచ్చి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!