కొండాయిలో మెడికల్ క్యాంపు నిర్వహణ
25 మందికి ఆరోగ్య పరీక్షలు, మందుల పంపిణీ
ఏటూరునాగారం, మే 20, తెలంగాణ జ్యోతి: ఏటూరునాగారం ఐటిడిఏ ఆదేశాల మేరకు జెన్ జాతీయ గరీమ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం కొండాయిలో వైద్యాధికారి డా. ప్రణీత్ కుమార్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో 25 మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి జ్వరం సంబంధిత పరీక్షలు చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు. అనంతరం ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసి ప్రస్తుత ఎండ తీవ్రత దృష్ట్యా అనవసరంగా బయట తిరగవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలం మానస, హెల్త్ అసిస్టెంట్ భాస్కర్, కార్యదర్శి వేణు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.








