గుర్రేవులలో తాగునీటి కష్టాలు
మిషన్ భగీరథ సరఫరా నిలిచిందని గ్రామస్తుల ఆవేదన
కన్నాయిగూడెం, మే 18, తెలంగాణ జ్యోతి: కన్నాయిగూడెం మండలం గుర్రేవుల గ్రామంలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరా పలురోజులుగా నిలిచిపోవడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంటింటికీ తాగునీరు అందక మహిళలు నీటి కోసం అవస్థలు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై గ్రామ కార్యదర్శికి పలుమార్లు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని ఆరోపించారు. ఎండాకాలంలో నీటి సమస్య మరింత తీవ్రమవు తున్న నేపథ్యంలో సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి మిషన్ భగీరథ తాగునీటి సరఫరాను పునరుద్ధరించి గ్రామ ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.









