ఇసుక క్వారీలకు జాయింట్ సర్వే నిర్వహించాలి

On: May 18, 2026 4:33 PM

ఇసుక క్వారీలకు జాయింట్ సర్వే నిర్వహించాలి

ఇసుక క్వారీలకు జాయింట్ సర్వే నిర్వహించాలి

డీసెల్టింగ్ విధానాన్ని రద్దు చేయాలని ఆదివాసి సంఘం డిమాండ్

వెంకటాపురం నూగూరు, మే 18, తెలంగాణ జ్యోతి: ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు ఉపాధి కల్పించే నూతన ఇసుక ఎస్‌బీఏ క్వారీలకు జాయింట్ సర్వే నిర్వహించాలని, డీసెల్టింగ్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ భూమిపుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పూనెం రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ములుగు జిల్లా కలెక్టర్‌కు ఇసుక పాలసీపై వినతిపత్రం అందజేసి, అనంతరం దాని ప్రతులను వెంకటాపురంలో మీడియాకు విడుదల చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో జాయింట్ సర్వే లేకపోవడంతో ఆదివాసులు ఉపాధి కోల్పోతున్నారని, గత ఏడాది నుంచి ఇసుక సొసైటీ సభ్యులు పలుమార్లు మైనింగ్ అధికారులకు వినతిపత్రాలు అందజేసినా స్పందన లేదని ఆరోపించారు. డీసెల్టింగ్ పేరుతో సొసైటీలను పక్కనపెట్టి భారీ మొత్తంలో ఇసుక తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సీతమ్మ ప్రాజెక్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండగా డీసెల్టేషన్ అనుమతులు మాత్రం ములుగు జిల్లాలో ఇస్తుండటం అన్యాయమని విమర్శించారు. భారీ స్థాయిలో ఇసుక తవ్వకాల వల్ల గోదావరిలో భూగర్భ జలాలు తగ్గి బోర్లు, బావుల్లో నీరు ఇంకిపోయే ప్రమాదం ఉందని, దీనివల్ల ఆదివాసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన సొసైటీలకు నూతనంగా సాండ్ ఏరియా జాయింట్ సర్వే నిర్వహించి ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బొగ్గుల సత్యం, కొరుస సౌందర్య, తాటి సామ్రాజ్యం, పోడెం సురేష్, బాడిస కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!