ఎల్ఆర్ఎస్ ఛార్జీలపై 25% రాయితీ : మే 1 నుంచి అమలు
హైదరాబాద్,ఏప్రిల్29, తెలంగాణజ్యోతి: ఎల్ఆర్ఎస్ అమల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) ఛార్జీలలో 25 శాతం రాయితీ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రాయితీ మే 1 నుంచి జూలై 31 వరకు అమల్లో ఉండనుంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్‌కు లక్షల్లో దరఖాస్తులు రావడంతో, వాటిలో సుమారు 50 శాతం పెండింగ్‌లో ఉన్నాయి. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా రూ.15,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని అంచనా వేసింది. పెండింగ్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు, ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఛార్జీలలో రాయితీ కల్పించినట్లు ప్రభుత్వం పేర్కొంది.









