వెంకటాపురంలో టెన్త్ ఫలితాల్లో టాపర్స్ మెరుపు 

On: April 29, 2026 6:24 PM

వెంకటాపురంలో టెన్త్ ఫలితాల్లో టాపర్స్ మెరుపు 

వెంకటాపురంలో టెన్త్ ఫలితాల్లో టాపర్స్ మెరుపు 

అన్ని పాఠశాలల్లో 100% ఉత్తీర్ణత

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురంమండలంలో విడుదలైన 10వతరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మండలంలో అత్యుత్తమ మార్కులు సాధించిన టాపర్స్ వివరాలను మండల విద్యాశాఖ అధికారి జి.వి.వి. సత్యనారాయణ మీడియాకు వెల్లడించారు. ఈ ఫలితాల్లో వై. చరణ్య లక్ష్మి (వెంకటాపురం), జి. యువరాజ్ (భారతి స్కూల్) ఇద్దరూ 553 మార్కుల తో మొదటి స్థానంలో నిలిచారు. పి. నిహారిక (జడ్పీఎస్ఎస్ వెంకటాపురం) 552 మార్కులతో రెండో స్థానం సాధించగా, బి. ప్రసన్న 548 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. ఇదిలా ఉండగా, జెడ్పిహెచ్ఎస్ వెంకటాపురం పాఠశాలలో తెలుగు మీడియం 58/58 మంది, ఇంగ్లీష్ మీడియం 78/78 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాలు నమోదు చేశారు. అలాగే జడ్పీఎస్ఎస్ ఆలుబాక (36/36), ఏహెచ్ఎస్ లక్ష్మీనగరం (45/45), ఏహెచ్ఎస్ చిరుతపల్లి-1 (43/43), చిరుతపల్లి-2 (20/20), కేజీబీవీ (27/27), భారతి స్కూల్ (19/19) విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. మండలంలోని అన్ని పాఠశాలలు శాతం వందకు వంద ఉత్తీర్ణత నమోదు చేసి విజయకేతనం ఎగురవేశాయి. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారి అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!