వెంకటాపురం బస్ స్టేషన్ రోడ్ ఎంట్రీ గోతులు పూడ్చీవేత.
– యువకులకు ప్రయాణికుల అభినందనలు.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం పట్టణంలోని టీఎస్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఇన్ గేట్ రోడ్ వర్షాకాలంలో భారీ వర్షాల కారణంగా గోతులు మయమైంది. అప్పట్లో కొంతమంది గ్రామస్తులు శ్రమదానంతో గోతులను పూడ్చి వేశారు. మరల గోతులు మయం కావడంతో ,ఇన్ గేట్ నుండి బస్ స్టేషన్లకు వచ్చే బస్సులు గోతులు వద్ద నెమ్మదిగా దిగుతూ, ఎక్కుతూ , సర్కస్ ఫీట్లతో బస్ స్టేషన్ ప్లాట్ఫారాల వద్దకు చేరుకుంటు న్నాయి. గోతులు కారణంగా బస్సు లో వున్న ప్రయాణికులు ఒక్కసారిగా కిందికి వంగి మల్లి ,నిలబడి సర్కస్ ఫీట్లు తో ఇబ్బంది పడుతున్నారు. ఇన్ గేటు గోతుల వద్ద బస్సు అటు ఇటు ఊగటంతో లగేజీలు సైతం ప్రయాణికుల మీద పడి స్వల్ప గాయాల పాలవుతున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యను పరిష్కరించాలని గోతులు పూడ్చాలని, వార్తాపత్రికలలో పలుమార్లు వార్తలు ప్రచురితం అయినా ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామపంచాయతీ, నాయకులు ఎవరు కూడ పట్టించుకోలేదు .దీంతో వెంకటాపురం పట్టణానికి చెందిన యువ కులు బొల్లె శ్రీరామ్ మూర్తి, పి. సాయి లు , ట్రాక్టర్ డ్రైవర్ల కు మన ఊరు,మన గ్రామం మన బస్టాండు అంటూ నచ్చజెప్పి పెద్ద, పెద్ద గోతులలో గ్రావెల్ మట్టి ని తెప్పించి గోతులను తాత్కాలికంగా పూడ్చివేసి, శభాష్ అనిపించుకున్నారు. బస్ స్టేషన్ ఆవరణ మరి యు ఇన్ గేట్, అవుట్ గేట్ ఇంటర్నల్ రోడ్లు పూర్తిస్థాయిలో రిపేర్ చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రతినిత్యం సుమారు 35 కు పైగా ఆర్టీసీ పల్లె వెలుగు, ఇతర ఎక్స్ ప్రెస్ సర్వీసులు వెంకటాపు రం బస్ స్టేషన్ సందర్శించి ప్రయాణికులతో రాకపోకలు సాగిస్తుం టాయి. నిత్యం ప్రయాణీకులతొ రద్దీగా ఉండే వెంకటాపురం బస్ స్టేషన్ సౌకర్యాలు, అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ప్రయాణికులు తీవ్రంగా విమర్శిస్తూ దుమ్మెత్తిపోస్తున్నారు . సౌకర్యాలు కల్పించడం లేదని గ్రామస్తులు, ప్రయాణికులు ఆర్టీసీ అధికారులపై, ప్రజాప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నోట్లతో ఓట్లు కొనుగోలు చేసే రాజకీయ నేతలు, ప్రజాపాలకులు, అన్నా హాజారే వారసులం అంటూ వైట్ కాలర్లు బస్ స్టేషన్, ప్రజల సమస్యలు పట్టించుకోరా అని ప్రయా ణికులు, ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. బస్ స్టేషన్ ను పూర్తి స్థాయి మరమ్మతులు చేసి, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాల ని పత్రికా ముఖంగా ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు ఆర్.టి.సి. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
2 thoughts on “వెంకటాపురం బస్ స్టేషన్ రోడ్ ఎంట్రీ గోతులు పూడ్చీవేత. ”