కారును ఢీకొట్టిన లారీ : వ్యక్తికి తీవ్ర గాయాలు

On: April 16, 2026 9:49 PM

ఆగి ఉన్న కారును వెనకనుంచి ఢీకట్టిన లారీ

కారును ఢీకొట్టిన లారీ : వ్యక్తికి తీవ్ర గాయాలు

ములుగు, ఏప్రిల్ 16 తెలంగాణ జ్యోతి :  ములుగు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో షిఫ్ట్ డిజైర్ కారు తీవ్రంగా ధ్వంసమై డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చిట్యాల మండలంలో విద్యుత్ లైన్ మెన్‌గా విధులు నిర్వహిస్తున్న చంద్రగిరి కుమారస్వామి ములుగు వైపు కారులో వస్తుండగా 130/11 కె.వి సబ్‌స్టేషన్ వద్ద లారీని ఓవర్‌టేక్ చేసే సమయంలో డివైడర్ వైపు వెళ్తున్న లారీ అకస్మాత్తుగా ఎడమవైపుకు మలుపు తీయడంతో కారు వెనుక భాగాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డిక్కీ భాగం పూర్తిగా నుజ్జునుజ్జై వెనుక సీటు వరకు ధ్వంసమైంది. అయితే డ్రైవర్ కుమారస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న ములుగు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!