భూపాలపల్లి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు 

On: April 16, 2026 6:55 PM

భూపాలపల్లి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు 

భూపాలపల్లి సీఎం పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు 

అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ దిశానిర్దేశం

కాటారం, ఏప్రిల్ 16 , తెలంగాణ జ్యోతి : భూపాలపల్లి జిల్లాలో ఈనెల 20వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి ఏర్పాట్లపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ కాలేశ్వరం, అనంతరం కాటారం మండలం నస్తురుపల్లిలో రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఇట్టి కార్యక్రమాలకు పటిష్టమైన బందోబస్తు కేటాయించిన విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. నస్తూర్ పల్లి బహిరంగ సభకు విచ్చేసే ప్రజలకు మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయాలన్నారు. బహిరంగ సభా స్థలి వద్ద పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి పరిశుభ్రం చేయాలని డీపీవోకు సూచించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. చేపట్టనున్న పనులను పర్యవేక్షణ చేయాలని సబ్ కలెక్టర్ కు సూచించారు. హెలి ప్యాడ్, అప్రోచ్ రోడ్డు బారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. అలాగే పబ్లిక్ మీటింగ్ వద్ద సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని పిఆర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాల్లో లైటింగ్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో పాటు అంబులెన్సులు సేఫ్ హౌస్ ఏర్పాటు చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక వాహనాలను అందు బాటులో ఉంచాలని ఆదేశించారు. కాళేశ్వర దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయాలని ఈఓను ఆదేశించారు. ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు వారి కేటాయించిన విధులపై ధ్రువీకరణ నివేదిక అందజేయాలని తెలిపారు. సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ నెల 19, 20 తేదీలలో ఇసుక లారీలకు అనుమతి ఇవ్వొద్దని, మూసివేయాలని ఆయన తెలిపారు. విధులు నిర్వహించు సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని కలెక్టరేట్ ఏవో కు సూచించారు.  అంతకుముందు కాలేశ్వరం నస్తూరి పల్లిలో సీఎం పర్యటన హెలిప్యాడ్ పనులను పరిశీలించారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డీవో హరికృష్ణ కాటారం డిఎస్పి సూర్యనారాయణ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!