సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి: డిఆర్డిఓ చంద్రశేఖర్

On: April 16, 2026 6:24 PM

సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి: డిఆర్డిఓ చంద్రశేఖర్

సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేరాలి: డిఆర్డిఓ చంద్రశేఖర్

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికకు ప్రాధాన్యం

ఫీల్డ్ అసిస్టెంట్లకు సన్మానం

వెంకటాపూర్, ఏప్రిల్ 16, తెలంగాణ జ్యోతి: ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా అధికారులు కృషి చేయాలని డిఆర్డిఓ చంద్రశేఖర్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో పాటు భవిష్యత్తులో ప్రవేశపెట్టబోయే నూతన పథకాల గురించి ప్రజలకు నిరంతరం తెలియజేయాలని, సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో అత్యధిక కూలీలతో పనులు నిర్వహిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వెంకటాపూర్ రామాచారి, లక్ష్మీదేవిపేట కేతిరి రాధిక, నల్లగుంట సునీత, రామానుజపూర్ నర్సయ్యలతో పాటు మేట్లను సన్మానించారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ రాష్ట్ర డైరెక్టర్ భగవాన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ సుగుణ, మండల స్పెషల్ ఆఫీసర్ సామ్యూల్, తహసీల్దార్ గిరిబాబు, ఎస్ఐ చల్లారాజు, ఎంపీడీవో రాజు, ఏపీవో మాలోత్ రాజు, ఎంఏఓ శైలజ, ఐసిడిఎస్ సిడిపిఓ శిరీష, ఎన్పీడీసీఎల్ ఏడిఈ వేణుగోపాల్, ఈసీ సురేష్, టెక్నికల్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!