యాదవ చైతన్య వేదిక ములుగు జిల్లా అధ్యక్షుడిగా రేవంత్
ములుగు, ఏప్రిల్ 3, తెలంగాణ జ్యోతి: యాదవ చైతన్య వేదిక ములుగు జిల్లా అధ్యక్షుడిగా జక్కుల రేవంత్ యాదవ్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షులు అయిలేష్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాన్ని బలోపేతం చేసి యాదవుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సంఘ కార్యకలాపాలను విస్తరించాలని, సభ్యత్వాన్ని పెంచాలని పేర్కొన్నారు.ఈ సందర్భంగా రేవంత్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో యాదవుల ఐక్యత కోసం కృషి చేస్తానని, బీసీ సంక్షేమం మరియు సామాజిక అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానన్నారు. అన్ని వర్గాల నాయకులను కలుపుకొని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. రేవంత్ యాదవ్ నియామకంపై స్థానిక నాయకులు, కార్యకర్తలు, సంఘ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు










