అంబులెన్స్‌లకు ఐదేళ్లుగా ఉచిత సేవలు

On: April 1, 2026 8:21 PM

అంబులెన్స్‌లకు ఐదేళ్లుగా ఉచిత సేవలు

అంబులెన్స్‌లకు ఐదేళ్లుగా ఉచిత సేవలు

పంచర్ షాపు నాగరాజు ఔదార్యం

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 1, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో టైర్స్ పంచర్ షాప్ నిర్వహిస్తున్న కూసం నాగరాజు ఐదేళ్లుగా 108 అంబులెన్స్‌లకు ఉచిత సేవలు అందిస్తూ తన ఔదార్యాన్ని చాటుతున్నారు. స్థానికంగా వేప చెట్టు కింద చిన్న దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న నాగరాజు, అత్యవసర పరిస్థితుల్లో గ్రామాలకు వెళ్లే అంబులెన్స్ వాహనాలకు పంచర్లు, గాలి నింపడం, టైర్ల పరిశీలన వంటి సేవలను నిమిషాల్లోనే ఉచితంగా అందిస్తున్నారు. ఆలుబాక కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన 108 వాహనాలకు కూడా నిరంతరం సహకరిస్తూ, సమయానికి సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అంబులెన్స్‌లు సకాలంలో రోగులను ఆసుపత్రులకు చేర్చడంలో తన వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని నాగరాజు తెలిపారు. ఆయన సేవలను గుర్తించి స్థానికులు, ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!