గిరిజన సంతలో రోడ్ భద్రతపై వాహనదారులకు అవగాహన 

On: March 31, 2026 6:42 PM

గిరిజన సంతలో రోడ్ భద్రతపై వాహనదారులకు అవగాహన 

గిరిజన సంతలో రోడ్ భద్రతపై వాహనదారులకు అవగాహన 

వెంకటాపురం, మార్చి 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన గిరిజన సంతకు వివిధ గ్రామాల నుండి వచ్చిన వాహనదారులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పీఎస్ఐలు సాయి కృష్ణ, తిరుపతిరెడ్డిలు పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నియమాలు వివరించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహన దారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఓవర్‌లోడ్‌తో ప్రయాణికులను ఎక్కించుకోరాదని సూచించారు. వాహనాలకు సంబంధించిన పత్రాలు, లైసెన్సులు తప్పనిసరిగా కలిగి ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!