సురక్షిత ప్రయాణంపై ప్రయాణికులకు పోలీసుల అవగాహన

On: March 29, 2026 8:27 PM

సురక్షిత ప్రయాణంపై ప్రయాణికులకు పోలీసుల అవగాహన

సురక్షిత ప్రయాణంపై ప్రయాణికులకు పోలీసుల అవగాహన

ములుగు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: సురక్షిత ప్రయాణం పై వాహనదారులకు ములుగు ఎస్సై ఉపేందర్ రావు ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా ఎస్సై మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో వాహనదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రయాణికులు ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడప రాదని, సీటు బెల్టు, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడప కూడదని సూచించారు. వేగ పరిమితులను పాటించా లని తెలిపారు. Arrive – alive అనే సందేశంతో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండి సురక్షితంగా ప్రయాణించి గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!