పాలెం వద్ద రోడ్డు ప్రమాదం – ఇద్దరికి తీవ్ర గాయాలు
వెంకటాపురం నూగూరు, మార్చి 29, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం గ్రామం సమీపంలోని ప్రధాన రహదారిపై ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని ముకునూరు పాలెంకు చెందిన కంటి అశోక్, విష్ణు అనే యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందులో కంటి అశోక్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.









