ఘనంగా టిడిపీ 44వ ఆవిర్భావ దినోత్సవం
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు – బైక్ ర్యాలీ
వెంకటాపురం నూగూరు, మార్చి 30, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమం భాగంగా మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం మండల పార్టీ అధ్యక్షుడు తాళ్లూరి లక్ష్మణరావు, ఉపాధ్యక్షుడు గారాపు రమేష్, సీనియర్ నాయకులు ఆలోకం సంజీవరావు, జిల్లా నాయకులు ఆత్మకూరి పట్టాభిరామారావు, పోలిన నాగేశ్వరావు, మునియ, పోలిన నవీన్ కుమార్, గుద్దేటి సర్వేశ్వరరావు, కోడూరి సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.









