కన్నాయిగూడెం పీహెచ్సీలో సిబ్బంది లేమి… రోగి ప్రాణాలకు ముప్పు
కన్నాయిగూడెం, ఫిబ్రవరి 4, (తెలంగాణ జ్యోతి): మండల కేంద్రంలోని లో డాక్టర్, నర్సులు సహా అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది. లక్ష్మిపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టాబ్లెట్లు సేవించడంతో కుటుంబసభ్యులు అతడిని పీహెచ్సీకి తరలించగా, అక్కడ ఒక ల్యాబ్ టెక్నిషన్ తప్ప ఇతర వైద్యులు ఎవ్వరూ లేకపోవడంతో తక్షణ చికిత్స అందలేదు. పరిస్థితి విషమించడంతో బాధితుడిని 108 అంబులెన్స్‌లో ఏటూరునాగారంకి తరలించారు. పీహెచ్సీలో సిబ్బంది గైర్హాజరు కారణంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడు తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.






