ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
వెంకటాపురం నూగూరు, జనవరి 20 (తెలంగాణ జ్యోతి):ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంగళవారం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన నగదు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడమే భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం, బీసీ మరిగూడెం సర్పంచులు తాటి సరస్వతి, సురిటి రాజేశ్వరి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ పీఏసీఎస్ చైర్మన్ చిడెం మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిడెం సాంబశివరావు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్రీరాములు రమేష్, కాంగ్రెస్ నాయకులు లకుమల్ల మోహన్, గుండమల్ల కిరణ్, డర్ర రవి, లబ్ధిదారులు, పలువురు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






