Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

On: December 2, 2025 6:36 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

కన్నాయిగూడెం, డిసెంబర్ 2, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామంలో సోమవారం మాక్స్ (MACS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంఆర్వీ సర్వర్ పాషా, వ్యవసాయ అధికారి ముంజా మహేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకూడదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే వరి ధాన్యాన్ని అమ్మాలని సూచించారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం తగిన మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈ కళ్యాణి, ఆర్ఐ గణేష్, చిట్టం శ్రీనివాస్, కొనుగోలు కేంద్ర ఇన్‌చార్జి పూజారి వెంకటేష్, రైతులు పూజారి నరేష్, మంగలార సత్యం, సంతోష్‌తో పాటు మహిళలు, హమాలీలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!