అమల్లోకి వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ 

On: November 26, 2025 11:22 AM

అమల్లోకి వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ 

అమల్లోకి వచ్చిన గ్రామపంచాయతీ ఎన్నికల కోడ్ 

– రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు

వెంకటాపురం, నవంబర్ 26, తెలంగాణ జ్యోతి : గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటనతో పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో మండల వ్యాప్తంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు కట్టే ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం ఉదయం వెంకటాపురం మేజర్ పంచాయతీ కార్యదర్శి జి. ప్రవీణ్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది అంబేద్కర్ సెంటర్, వేపచెట్టు సెంటర్, ప్రధాన మార్కెట్ సెంటర్‌లలో ఉన్న స్వర్గీయ రాజకీయ నేతల విగ్రహాలకు ముసుగులు కట్టారు. అలాగే రాజకీయ పార్టీల జెండాలు, తోరణాలు తొలగించారు. గైడ్‌లైన్‌లను ఉల్లంఘించినట్లయితే ఎన్నికల కోడ్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!