హనుమంతు వాగును తవ్వేస్తున్నారు..?
-యూనియన్ పేరుతో ఇష్టారాజ్యంగా ఇసుక అక్రమ రవాణా..!
– పగలు రాత్రి అనే తేడాలేకుండా రవాణా..
– పట్టించుకోని రెవిన్యూ అధికారులు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీరు పేద కుటుంబాలకు ఇండ్ల కోసం వాగులో నుండి ఇసుకను ఎలాంటి అనుమతులు లేకుండా రైతులకు మిర్చి కల్లాలకు గాని, నూతన ఇండ్లకు తొలుకోవచ్చని ఆదేశించింది. కొంతమంది దీనిని ఆసరాగా చేసుకుని యూనియన్ పేరుతో ఇష్టారాజ్యంగా పగలు రాత్రి అనే తేడా లేకుండా హనుమంతు వాగును తవ్వేస్తున్నారు. కన్నాయిగూడెం మండలంలోని బుట్టయిగూడెం గ్రామంలో కొద్దిరోజుల క్రితం ట్రాక్టర్ల యూనియన్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. యూనియన్ ఉంటే ఇసుక పుష్కలంగా తవ్వుకోవచ్చని, అంతేకాకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ప్రశ్నిస్తే మాకు యూనియన్ ఉందని అధ్యక్షుడు పేరు చెప్పి విచ్చలవిడిగా రవాణా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా సపోర్ట్ చేయడంతో రెచ్చిపోతున్న ఇసుక డాన్ లు ఒక్క ఇసుక లోడ్ ట్రాక్టర్ కు రూ. 1200 తీసుకుంటారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవిన్యూ డిపార్ట్మెంట్ కళ్ళముందే జరుగుతున్నప్పటికీ వారిపై ఎందుకు చర్యలు తీసుకుంటలేరని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.