తాటి ప్రతాప్ నాయుడు మృతి పట్ల పలువురి సంతాపం
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన తాటి ప్రతా ప్ మృతికి పలువురు ప్రముఖులు, రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు,బంధుమిత్రులు పెద్దసంఖ్యలో హాజరై సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ఆయన దశ దినకర్మ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నూగూరు వెంకటాపురం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు లు చిడెం సాంబశివరావు, సీనియర్ నాయకులు శ్రీరాములు రమేష్, ప్రముఖ వ్యాపారవేత్త బి. సురేందర్, మాజీ ఎంపీటీసీ సీతాదేవి, బి ఆర్ ఎస్ అధ్యక్షులు గంపా రాంబాబు, వేల్పూరి లక్ష్మీనారాయణ, జాగర శాంతమూర్తి యాదవ్, బిజెపి నాయకు లు రఘురాం, సంకా హేమ సుందర్ ,ఇంకా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఉన్నారు.