చెరుకూరు అంతర్రాష్ట్ర సివిల్ సప్లై చెక్‌పోస్టు తనిఖీ
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం 163 జాతీయ రహదారి చెరుకూరు వద్ద ఏర్పాటుచేసిన అంతర్రాష్ట్ర సివిల్ సప్లై చెక్‌పోస్టును సోమవారం రాత్రి సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ స్పెషల్ డ్యూటీ అధికారి ఎం. ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సరి హద్దు చెక్‌పోస్ట్ వద్ద ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం విధులు నిర్వహించాలని, అనుమతులు లేని అక్రమ రవాణా ను నిరోధించాలని ఈ సందర్భంగా పలు అంశాలపై చెక్ పోస్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా రికార్డుల ను పరిశీలించి సిబ్బందికి, మండల అధికారులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాజేడు తహసిల్దార్ వీరభద్ర ప్రసాద్, డిప్యూటీ తహసిల్దార్ రాహుల్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.