ఆశ్రమ పాఠశాలలో వైద్య పరీక్షలు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నా యిగూడెం మండలంలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గత కొన్ని రోజుల నుండి విద్యార్థులు అనారోగ్యానికి గురికావ డంతో ఎంసిఎచ్ డాక్టర్ గిరి బృందం విద్యార్థులకు వైద్య పరీక్ష లు నిర్వహించారు. అనంతరం డాక్టర్ గిరి మాట్లాడుతూ… ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల చాలా మంది అనారో గ్యానికి గురవుతున్నారని, చాలా మంది జ్వరం, దగ్గు, జలు బుతో ఆస్పత్రికి వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మంకిడి రాజశేఖర్, పోదెం కృష్ణ ప్రసాద్, ఏఎన్ఎం కల్పన, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.