మహాత్మా గాంధీ ఆశయ బాటలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి

Written by telangana jyothi

Published on:

మహాత్మా గాంధీ ఆశయ బాటలో కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి

– కాటారంలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి: 9 ఏళ్లు గత ప్రభు త్వంలో అశాంతి వాతావరణంలో గడిపామని,ప్రజలు మార్పు కావాలని కోరడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కాటారం మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో గారెపల్లి లో నూతనంగా నిర్మించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ ఖరె, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, సబ్ కలెక్టర్ మాయంక్ సింగ్, జెసి విజయలక్ష్మి ల తో కలిసి ఆవిష్కరించారు. గతంలో ఈ ప్రాంతంలో అశాంతితో పరిస్థి తులు ఏ విధంగా ఉన్నాయో ప్రజలకు తెలుసునని, మహాత్మా గాంధీ ఆశయాలతో ముందుకు నడువాలని, మార్పు కావాలని ప్రజలు నన్ను గెలిపించారని శ్రీధర్ బాబు అన్నారు. మహాత్మా గాంధీ కి పూలదండలు వేసి నివాళులర్పించారు. కాటారం సొంత మండలంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆర్యవైశ్యులను మంత్రి శ్రీధర్ బాబు అభినందించారు. వైశ్యుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఏ పని చేపట్టిన పూర్తిస్థాయిలో సహ కారం అందిస్తామని, అభివృద్ధిని ఆశించే ఆర్య వైశ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం. అభివృద్ధి కోసం మీరు మేము కలిసి నడుద్దామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కాటారం మండల కేంద్రంలో ఆర్య వైశ్యుల కోసం, మండల వర్తక సంఘం కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కు నిధులు మంజూరు చేస్తానని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. మహిళల అభివృద్ధి కోసం కాటారం మండలం నుండి సుమారు 100 మంది మహిళలకు మంత్రి శ్రీధర్ బాబు సొంత ఖర్చులతో హైదరాబాదులో ఉపాధి లో పది రోజులు శిక్షణ ఇప్పిస్తామని మంత్రి పేర్కొన్నారు. కాటారంలో సుమారు మూడు కోట్ల వ్యయంతో ఇండస్ట్రీ స్థాపించి మహిళలకు ఉపాధి కల్పిస్తా మన్నారు. సుమారు నాలుగు కోట్ల వ్యయంతో కాటారంలో ఐటిఐ భవన నిర్మాణం చేపడుతున్నట్టు స్థల సేకరణ పూర్త యినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు పవిత్రం శ్రీనివాస్, మండల శాఖ అధ్యక్షులు అంతుల శ్రీనివాస్, ఆవోప రాష్ట్ర సహాయ కార్యదర్శి అనంతుల రమేష్ బాబు, జిల్లా మాజీ అధ్యక్షులు శిరుప అనిల్, ఐతు రమేష్, మండల అవోపా అధ్యక్షులు ఎం ఎల్ ఎన్ మూర్తి, నాయకులు అల్లాడి సదాశివ్, కముటాల రవీందర్, కమల మనోహర్, కలికోట శ్రీనివాస్, దారం నగేష్ కుమార్, అల్లాడి చంద్రమౌళి, తడకమట్ల రమేష్ బాబు, మద్ది నవీన్ కుమార్, బచ్చు ప్రకాష్,చిట్టూరి రవి, అల్లాడి శ్రీనివాస్, బీరెల్లి అంజయ్య, మద్ది సూర్యనారాయణ, అల్లాడి ఓం ప్రకాష్, దారం నందకిషోర్, అనంతుల వెంకటేశ్వర్లు, మద్ది శ్రీమన్నారాయణ, పల్లెపాటి ప్రకాష్, దారం వెంకటేశ్వర్లు, అల్లాడి మహేష్, దారం రమణయ్య, పాయింఛ ప్రవీణ్ కుమార్, సామ చిన్న వీరయ్య, సామ బాలచందర్, చందా విజయభాస్కర్,మండల స్పెషల్ ఆఫీసర్ సంజీవరావు, తహసిల్దార్ నాగరాజు, ఎంపీడీవో అడ్డూరి రాజు, కాంగ్రెస్ నాయకులు కోట రాజాబాపు, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పంతకాణి సమ్మయ్య, మాజీ సర్పంచులు ఓన్న వంశవర్ధన్ రావు, నవీన్ రావు, ఆంగోతు సుగుణ, జాడి మహేశ్వరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాటారం డి.ఎస్.పి గడ్డం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now