ఫర్టిలైజర్స్ గుమస్తాల సంఘం అధ్యక్షునిగా సత్యనారాయణ ఎన్నిక
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఫర్టిలైజర్స్ గుమస్తాల సంఘం అధ్యక్షునిగా సత్యనారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తామంతా ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకునేందుకు, సమస్యలు పరిష్కరించుకునేందుకు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. అలాగే ముఖ్య సలహాదారుగా బొల్లి సునీల్ ను హర్షద్వానాల మధ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు మండలంలోని ఎరువులు పురుగు మందు దుకాణాల్లో పనిచేస్తున్న సుమారు 34 మందికి పైగా గుమస్తాలు సమావేశంలో పాల్గొన్నారు.