ఘనంగా ఉట్ల పండుగ సంబరాలు – తరలివచ్చిన భక్తజనం
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని మూడవ రోజు బుధవారం దశమి మంచి రోజు కావడంతో ములుగు జిల్లా వెంకటాపురం పట్టణ కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతరవీధులలో ఉట్ల పండుగను ఘనంగా నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి పల్లకి సేవలో, వెంకటాపురం పట్టణ పురవీధులలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఉట్టుకొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలాగే పాత మార్కెట్ సెంటర్ లోని జాగర వారి వీధిలో ఉట్టు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనేకమంది భక్తులు ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో తిలకించి పునీతులయ్యారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పల్లకి సేవలో వెంకటాపురం పట్టణ పుర వీధులలో ఊరేగింపు జరిపి భక్తులకు దర్శనభాగ్యం కల్ఫించారు. ప్రధాన రహదారి కి ఇరువైపులా ఉన్న దుకాణదారులు, గృహస్తులు స్వామి వారి పల్లకి సేవకు ఎదురుగా శుద్ధి జలాన్ని ఆరబోసి, పసుపు కుంకాలు టెంకాల సమర్పణతో, పూజలు నిర్వహించి, స్వామి వారి పురోహితుల ఆశీర్వచనాలు పొందారు.